News March 25, 2024

ప్రకాశం: వివాహితను కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై వ్యక్తి బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన కొప్పరపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొప్పరపాలెంలో ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వల్లెపు నాగేశ్వరరావు కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎదురు తిరిగి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చేసరికి పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News September 28, 2025

ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు SE కీలక సూచన

image

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు SE వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించే కౌంటర్లు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే 30వ తేదీ కూడా సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఆయన విద్యుత్ వినియోగదారులకు సూచించారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.

News September 27, 2025

ప్రకాశంలో పర్యాటక అందాలు ఎన్నో ఎన్నెన్నో..!

image

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రదేశాల జాబితా కోకొల్లలు. ఇటు ఆధ్యాత్మిక, అటు ప్రకృతి హొయలు గల పర్యాటక ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి. భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, మాలకొండ, సింగరాయకొండ నరసింహస్వామి క్షేత్రం వంటి ఆలయాలు ఉన్నాయి. కొత్తపట్నం, పాకల బీచ్‌లు, మైలవరం డ్యాం, నల్లమల అడవుల అందాలు ఎన్నో. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు.