News April 10, 2025
ప్రకాశం: విషాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి పరిధిలోని ఇప్పటంలో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పనికోసం వెళ్లిన కుటుంబంలో ఈ విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి బాధిత కుటుంబాన్ని, చిన్నారుల మృతదేహాలను అద్దంకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 18, 2025
తిరుమలలో ఒంగోలు వాసుల కారు దగ్ధం

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News April 18, 2025
ఒంగోలు: ‘వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి’

తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. RWS అధికారులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, సిబ్బందిని ఆమె ఆదేశించారు. అవసరమైన ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
News April 18, 2025
బంగారు బాల్యం జిల్లా మోడల్ అధికారిగా రాచర్ల ఎంఈవో

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బంగారు బాల్యం ప్రాజెక్టుకు జిల్లా నోడల్ అధికారిగా రాచర్ల ఎంఈవో గిరిధర్ శర్మను జిల్లా కలెక్టర్ అన్సారియా నియమించారు. జిల్లా స్థాయి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో బడి ఈడు గల బాలలకు సంబంధించిన అంశాల పైన జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరి నియామకం పట్ల పలువురు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.