News April 22, 2025

ప్రకాశం: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

ప్రకాశం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పామూరులో బాల భవేశ్ తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురంలోని కాశీ రావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన అరవింద్ చెన్నైలో చదువుకుంటూ నీటిలో మునిగి మృతి చెందాడు.

Similar News

News April 22, 2025

S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

image

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News April 22, 2025

ప్రకాశం: విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

image

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలలో తిరుగుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయింది.

News April 22, 2025

ఒంగోలు: ఆ విద్యార్థులకు నేడే చివరి గడువు

image

DELED 4వ సెమిస్టర్ విద్యార్థులు నేటి సాయంత్రంలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.250 పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. రూ.250ఫైన్‌తో ఈనెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!