News January 10, 2026
ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News February 20, 2026
మార్కాపురం జిల్లాకు కొత్త లేడీ ఆఫీసర్

మార్కాపురం జిల్లా రవాణాశాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా టీవీ నాగలక్ష్మి గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ… వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.
News February 20, 2026
ప్రకాశం: బీటెక్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో విషాదం నెలకొంది. మంగపతివారిపాలెం గ్రామానికి చెందిన మల్లెబోయిన శ్రీచరణ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పొలాల్లో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్లాడు. తిరిగి వస్తూ మధ్యలో ఈతకు దిగి మృతిచెందాడు.
News February 20, 2026
24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.


