News September 24, 2025
ప్రకాశం: ‘సమస్యలు పరిష్కరించకుంటే పెన్షన్ ఇవ్వం’

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చేనెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయకుండా ఆపివేస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని MPDO కార్యాలయంలో MPDO చెన్నారావుకు సచివాలయ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ వాలంటరీలు చేయవలసిన పనులన్నీ తమచేత చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 27, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు SE కీలక సూచన

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు SE వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించే కౌంటర్లు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే 30వ తేదీ కూడా సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఆయన విద్యుత్ వినియోగదారులకు సూచించారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.
News September 27, 2025
ప్రకాశంలో పర్యాటక అందాలు ఎన్నో ఎన్నెన్నో..!

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రదేశాల జాబితా కోకొల్లలు. ఇటు ఆధ్యాత్మిక, అటు ప్రకృతి హొయలు గల పర్యాటక ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి. భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, మాలకొండ, సింగరాయకొండ నరసింహస్వామి క్షేత్రం వంటి ఆలయాలు ఉన్నాయి. కొత్తపట్నం, పాకల బీచ్‌లు, మైలవరం డ్యాం, నల్లమల అడవుల అందాలు ఎన్నో. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు.
News September 27, 2025
ప్రకాశం: ‘ఒకరికి ఒక్క ఓటే ఉండాలి’

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని DRO చిన్న ఓబులేసు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ.. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారు, వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18ఏళ్ళు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.