News February 5, 2026
ప్రకాశం హైవేలపై స్పెషల్ టీమ్స్: ఎస్పీ

జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని జాతీయ రహదారులపై 34 రోడ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అలాగే అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2026
ప్రకాశం: బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని అప్పగిస్తారంట..!

నరసరావుపేటలోని ఓ ప్రముఖ గుండె వైద్యశాలలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు (M) కుందుర్తికి చెందిన సాతులూరి పెద్ద ఏడుకొండలు గుండె జబ్బుతో వైద్యశాలలో చేరాడు. నొప్పి తీవ్రం కావడంతో ఏడుకొండలు మృతి చెందాడు. వైద్యశాల యాజమాన్యం మాత్రం బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పట్టు పట్టడంతో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
News February 21, 2026
ప్రకాశం: మాల్ ప్రాక్టీస్‌కు చెక్.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. 79 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నపత్రాల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, CC కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటువంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News February 21, 2026
చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.


