News November 7, 2024
ప్రకాశం: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు డీఈవో కిరణ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పదో తరగతి పరీక్ష ఫీజు కట్టేందుకు ఈనెల 18వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. రూ.50 ఫైన్‌తో 25వ తేదీలోగా, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 3, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 10వ తేదీలోపు ఫీజు కట్టవచ్చని సూచించారు. ఆయా పాఠశాలల HMలు WWW.BSE.AP.GOV.IN ద్వారా చెల్లించాలని చెప్పారు.
Similar News
News January 3, 2026
ప్రకాశం జిల్లాలో 104 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రకాశం జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 104 బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష APC అనిల్ కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు www.deoprakasam.co.in చూడాలని సూచించారు.
News January 3, 2026
ఆదర్శంగా ప్రకాశం కలెక్టర్..!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకు రావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో విద్యార్థులకు అందించనున్నారు.