News August 8, 2025

ప్రకాశం: 11 నుంచి సెమిస్టర్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు డీఈఐఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలకు డైట్ మైనంపాడులో అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, 2023-25, 2022-24 బ్యాచ్ వారికి మాత్రమే ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News August 30, 2025

రేపు ఒంగోలుకు రానున్న MP మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలులోని తన కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఒంగోలులో జరిగే కార్యక్రమాలలో ఎంపీ మాగుంట రేపు పాల్గొంటారన్నారు. అంతేకాకుండా ఒకటో తేదీ సోమవారం కూడా ఎంపీ మాగుంట తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

News August 30, 2025

ప్రకాశం: బార్ల లైసెన్స్ కోసం 78 దరఖాస్తులు.. కాసేపట్లో లాటరీ..!

image

ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.

News August 30, 2025

చీమకుర్తిలోని క్వారీలో ప్రమాదం

image

చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.