News April 15, 2025

ప్రకాశం: AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

image

AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. “జగన్‌‌ని హత్యచేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్‌లో ఎన్‌ఐఏ చెప్పిన విషయం AB వెంకటేశ్వరరావు మరిచిపోయారా అని ప్రశ్నించారు.  జగన్‌పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌కి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.

Similar News

News April 16, 2025

ఒంగోలు: కానిస్టేబుల్ భార్య సూసైడ్

image

పొదిలికి చెందిన పూర్ణిమ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నబజారు CI వివరాల మేరకు.. ఒంగోలుకి చెందిన AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో ములాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో పూర్ణిమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య కూడా ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.

News April 16, 2025

ప్రకాశం: సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న మాజీ మంత్రి?

image

మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర సురేశ్‌కు చెందిన జార్జ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించారని టాక్. తాటిపత్రికి చెక్ వేయాలని చూడగా వైవీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

News April 16, 2025

నారా లోకేశ్‌తో భేటీ అయిన దామచర్ల

image

ఇవాళ సాయంత్రం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో మంగళగిరిలోని వారి నివాసంలో ఎమ్మెల్యే దామచర్ల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి మంత్రితో చర్చించిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించిన్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!