News August 22, 2025

ప్రకాశం: FREEగా స్మార్ట్ ఫోన్

image

ప్రకాశం జిల్లాలో మూగ, చెవుడు ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదని.. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్ పూర్తి చేసి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు కలిగిన వాళ్లు అర్హులు. www.apdascac.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News August 22, 2025

భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News August 22, 2025

ప్రకాశం: భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

image

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2025

ప్రకాశం: కానిస్టేబుల్ అభ్యర్థుల పత్రాల పరిశీలన.. 22 మంది గైర్హాజరు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.