News September 8, 2024

ప్రకాశం SP పేరిట చాటింగ్.. సైబర్ నేరగాళ్ల వల

image

ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా జిల్లా SP దామోదర్‌ను టార్గెట్ చేశారు. ఎస్పీ పేరుతో వాట్సప్ DP పెట్టి కొత్త నెంబర్‌తో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ సీఐ వి సూర్యనారాయణకు రూ.50వేలు అర్జెంటుగా కావాలంటూ వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో సామాన్యులు అలర్డ్‌గా ఉండాలన్నారు.

Similar News

News September 29, 2024

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయం: ప్రకాశం ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే తమ ధ్యేయమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే 474 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసి ఉచితంగా మందులు అందించారు.

News September 28, 2024

ప్రకాశం: అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేయండి: కలెక్టర్

image

వచ్చే నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచే ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై డీఎల్‌డీఓలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 2వ తేదీ మహాత్మా గాంధీజీ జయంతి ప్రభుత్వ సెలవు దినము కావున 1వతేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 28, 2024

పొదిలి: జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

image

మార్కాపురంలో ఈ నెల 25న జరిగిన నియోజకవర్గం స్థాయి స్కూల్ గేమ్స్‌లో పొదిలి విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్ -17, అండర్-14 విభాగంలో విజయం సాధించి జిల్లా వాలీబాల్ టీంకి అండర్ -17లో పి. చరణ్, డి. హర్షవర్ధన్ పి. బ్రహ్మ చరణ్, అండర్ -14 విభాగంలో ఏ.సాత్విక్, వ. జీవన్ చందులు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీడీ కె. స్టీఫెన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.