News August 19, 2025
ప్రకాశం SP మీకోసంకు 64 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News August 19, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్‌కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.
News August 19, 2025
నోరు మెదపని అధికారులు: ప్రకాశం కలెక్టర్ సీరియస్

సరైన సమాచారం లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడంపై పలువురు కమిషనర్లు, MPDOల తీరుపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పలు శాఖలు చేపడుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశ్నలకు పలువురు అధికారులు తెల్లముఖం పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
News August 19, 2025
దివ్యాంగ విద్యార్థులకు DEO సూచన

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.