News September 20, 2025
ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం: ఎంపీ కావ్య

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎంపీ కడియం కావ్య హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. కులం, మతం, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మహిళ కలిసి మెలిసి ఆడుకుంటారని తెలిపారు. ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకు సొంతమన్నారు.
Similar News
News September 20, 2025
7,267 పోస్టులకు నోటిఫికేషన్.. అప్లికేషన్స్ స్టార్ట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, PG, B.Ed, డిప్లొమా పాసైనవారు OCT 23 వరకు అప్లై చేసుకోవచ్చు. PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్ 225, వార్డెన్ 346, Jr క్లర్క్ 228, అకౌంటెంట్ 61, స్టాఫ్ నర్స్ 550, ఫీమేల్ వార్డెన్ 289, ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులున్నాయి. వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి.
News September 20, 2025
ఈనెల 24న పాలకొల్లు రానున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పాలకొల్లులో సిద్ధం చేస్తున్న హెలిపాడ్, కళ్యాణ వేదిక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నందున, బ్రాడీపేట బైపాస్ రోడ్డులో హెలిపాడ్‌ను పరిశీలించి, పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
News September 20, 2025
నాయుడుపేటలో లారీ ఢీకొని ట్రాక్టర్ మెకానిక్ మృతి

నాయుడుపేటలోని ఎల్.ఏ సాగరానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ లక్ష్మణ్ లారీ ఢీకొని శనివారం మృతి చెందాడు. లక్ష్మణ్ నాయుడుపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ సర్వీస్ కోసం బైకుపై ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మూర్తిరెడ్డిపాలెం వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్‌కి తరలించారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.