News March 5, 2025
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ చేతన్

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సాయి ఆరామంలో ప్రభుత్వం-ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై ఉద్యానవన, సెరీకల్చర్, వెలుగు శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. రైతు సేవ కేంద్రాలు, మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 14, 2025
మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు: ఓంబిర్లా

AP: భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘స్త్రీలకు గౌరవమివ్వడం ఆది నుంచి వస్తున్న సంప్రదాయం. స్వాతంత్ర్య పోరాటంలోనూ వారు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించింది’ అని చెప్పారు.
News September 14, 2025
బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
News September 14, 2025
మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

తిరుపతి వేదకగా ఆదివారం ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.