News March 29, 2025
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి: కలెక్టర్

గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో రైతు బాలమద్దిలేటి దేశీ విత్తనాలతో వేసిన ప్రకృతి వ్యవసాయ వరి పొలాన్ని కలెక్టర్ రాజకుమారి శనివారం సందర్శించారు. రైతును పంట వివరాలు అడిగి తెలుసుకుని, దేశీ వరి పండిస్తున్నందుకు ఆయనను అభినదించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారితో పాటు డీఏవో మురళీ కృష్ణ, ఏడీఏ పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ

మంచిర్యాలలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో రాధాకృష్ణ అనే సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన కూతురు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లాకర్‌లోని రూ.65 వేలు విలువ చేసే 20 గ్రా బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 1, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 1, 2025
NRPT: ‘ప్రభుత్వం LRS గడువు పొడిగించాలి’

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు మరో రెండు నెలలు పొడిగించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రచారం, అవగాహన లేని కారణంగా చాలా మంది ఎల్ఆర్ఎస్ రుసుం కట్టలేదని అన్నారు. వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని కోరారు. వెంచర్లు చేసిన వారికి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించాలని అన్నారు.