News February 4, 2025

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News July 9, 2025

సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష.. గడువు పెంపు

image

TG: సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వరకు పొడిగించినట్లు CMD బలరామ్ నాయక్ తెలిపారు. UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు దీన్ని గమనించాలన్నారు. తొలుత ఈ నెల 7వరకు గడువు విధించగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ పథకం కింద TG అభ్యర్థులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రూ.లక్ష సాయం చేయనున్నారు.

News July 9, 2025

నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

image

దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఐఏన్‌టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ ఉద్యోగులు, నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నేషనల్‌ ఎస్సెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌‌ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని, పీఏస్‌యూల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

News July 9, 2025

గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్‌ను కలిసిన అధికారుల సంఘం

image

సింగరేణి డైరెక్టర్‌ (పా) గౌతమ్ పొట్రూను గోదావరిఖని క్యాంప్‌ ఆఫీస్‌లో సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధులు ఈరోజు కలిశారు. నూతన డైరెక్టర్‌ (పా)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను సన్మానించారు. డైరెక్టర్‌ (పా) స్థాయిలో అధికారుల సంఘంతో గత నవంబర్‌లో జరిగిన స్ట్రక్చర్‌ సమావేశంలో అంగీకరించిన అంశాలపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ది నర్సింహులు, పొనగోటి శ్రీనివాస్‌, బి.మల్లేశం ఉన్నారు.