News January 14, 2026
ప్రకృతి సేద్యం.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణ

ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసే వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచాలి. ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్తగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5 లీటర్ల 5% వేప కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిలక దశలో మరియు అంకురం దశలో 3లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News February 15, 2026
వరంగల్: అభివృద్ధి కమిటీ సమావేశాలేవి?

వరంగల్‌లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశాలు సుమారు పదేళ్లుగా నిర్వహించడం లేదు. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సీకేఎం జీఎంహెచ్, ఎంజీఎం వంటి సర్కారు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. గతంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించే సమస్యలను వెంటనే పరిష్కరించేవారు.
News February 15, 2026
టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ దూరం

భారత U19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు హాజరవుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావట్లేదని స్కూల్ డైరెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ చెప్పారని పేర్కొన్నారు. వరుస టోర్నమెంట్లు, ట్రైనింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన U19 WCలో వైభవ్ 7 మ్యాచుల్లో 439 రన్స్ చేసి సత్తా చాటారు.
News February 15, 2026
$6.7B తగ్గిన విదేశీ మారక నిల్వలు

ఈ నెల 6తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $6.711 బిలియన్లు తగ్గి $717.064Bకి చేరినట్లు RBI వెల్లడించింది. బంగారం నిల్వలు $14.208B తగ్గి $123.476B చేరడమే ఇందుకు కారణం. అంతకుముందు వారం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్స్ రికార్డు స్థాయిలో $723.774Bకి పెరిగాయి. ఇప్పుడు కాస్త తగ్గినా మొత్తంగా బలంగానే ఉన్నాయని RBI పేర్కొంది. అటు విదేశీ కరెన్సీ ఆస్తులు $570.053Bకి పెరిగాయని తెలిపింది.


