News December 30, 2025
ప్రగతి పథంలో విశాఖ విమానాశ్రయం

విశాఖ విమానాశ్రయం 2025లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 27 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల దేశీయ సరకు రవాణా చేశారు. గత ఏడాదితో పోలిస్తే విమానాశ్రయ కార్యకలాపాల్లో 9.29% వృద్ధి నమోదైంది. కస్టమర్ సంతృప్తి విషయంలో దేశవ్యాప్తంగా విశాఖ విమానాశ్రయం 9వ స్థానంలో నిలిచింది.
Similar News
News February 15, 2026
బంగ్లాదేశ్ తర్వాతి ప్రెసిడెంట్‌గా యూనస్?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP ఘనవిజయం సాధించడంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ పాత్ర తర్వాత ఏంటనే చర్చ జరుగుతోంది. ఆయన్ను దేశాధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మంగళవారం కొలువుదీరనుంది. సమర్థులైన మేధావుల సేవలను వినియోగించుకుంటామని BNP వర్గాలు చెబుతున్నప్పటికీ యూనస్ మాత్రం తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని గతంలో చెప్పారు.
News February 15, 2026
ఢిల్లీలో ఫిర్యాదు.. వరంగల్‌లో దర్యాప్తు..!

నర్సంపేట(M) లక్నేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వృద్ధ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ మోసపు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితురాలి చిన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటికి వస్తున్నట్లు సమాచారం.
News February 15, 2026
గద్వాల ఛైర్మన్ ఎన్నిక.. ఇద్దరికే ‘ఎక్స్ అఫీషియల్’ ఓటు!

గద్వాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీలను మాత్రమే రిటర్నింగ్ అధికారులు ఎక్స్ అఫీషియల్ ఓటర్లుగా ఖరారు చేశారు. గడువు ముగిసే వరకు కేవలం కాంగ్రెస్ మాత్రమే దరఖాస్తు చేయడంతో, సోమవారం జరగనున్న ఎన్నికలో ఎంపీ డాక్టర్ మల్లు రవి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


