News April 30, 2024

ప్రచారం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయిన సంధ్యారాణి

image

మక్కువ మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అర్ధాంతరంగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతరం సంధ్యారాణిని సాలూరుకు తరలించారు.

Similar News

News April 21, 2025

VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

image

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్క‌ర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.

News April 21, 2025

విజయనగరం పీజీఆర్ఎస్‌కు 205 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్క‌ర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

News April 21, 2025

చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

image

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

error: Content is protected !!