News March 21, 2024
ప్రచారాల్లో పాల్గొనే వాలంటీర్ల తొలగింపుకు చర్యలు: కలెక్టర్
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులతో పాటు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని చెప్పారు.
Similar News
News December 4, 2024
పల్నాటి మహా వీరుడు.. మాల కన్నమదాసు
11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.
News December 4, 2024
అమరావతి ప్రాంతంలో కంపించిన భూమి
గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.
News December 4, 2024
డ్రోన్ల వినియోగం విస్తృతం చేయండి: సీఎం
అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.