News October 8, 2025
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు: అదనపు కలెక్టర్

ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ప్రచార ఖర్చులను పక్కాగా నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ మిని సమావేశపు హాలులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించి రేట్ చార్ట్ నిర్దేశించే అంశంపై డీపీఓ, ఆడిట్ అధికారులు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, ప్రింటర్స్, ఫ్లెక్సీ యజమానులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News October 8, 2025
వరంగల్: జడ్జిమెంట్ డే.. సర్వత్రా ఆసక్తి!

స్థానిక ఎన్నికల సంగ్రామానికి ఆరంభంలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. బ్యాలెట్ పోరు పల్లెల్లో రాజుకోకముందే కోర్టు మెట్లెక్కింది. బీసీ రిజర్వ్ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ కాస్త మందగించింది. హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు విచారణకు రానుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న ఆశావహులు కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.
News October 8, 2025
పసికందు మృతి ఘటనలో ఐసీడీఎస్ పీడీ సస్పెండ్

అనంతపురంలోని శిశు గృహంలో శిశువు ఆకలితో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగంతో ఐసీడీఎస్ పీడీ నాగమణిని అధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా మరికొందరు కాంట్రాక్ట్ అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆనంద్ నేడో, రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
News October 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపురం, నందరాడ మధ్య మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజానగరం సుబ్బారావు కాలనీకి చెందిన సత్యనారాయణ బైక్‌పై కోరుకొండ నుంచి తిరిగి వస్తుండగా, నందరాడ దాటిన తర్వాత కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్ మోటార్ బైక్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.