News March 27, 2024

ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం తగదు: చెవిరెడ్డి

image

వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.

Similar News

News September 29, 2025

ఘోరం.. ఇసుకలో బిడ్డ లభ్యం

image

వరదయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి ఆడ శిశువుకు జన్మనిచ్చి అక్కడే ఉన్న ఇసుకలో పూడ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 29, 2025

అక్రమ కేసులు పెడుతున్న వారికి తిప్పలు తప్పవు: రోజా

image

YCP శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఆదివారం ఆమె డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ.. YCP శ్రేణులపై దాడులే లక్ష్యంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమ వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News September 29, 2025

చిత్తూరు: ‘నేడు కలెక్టరేట్‌లో గ్రివెన్స్ డే’

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.