News August 13, 2025

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

Similar News

News August 13, 2025

NZB: జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: CP

image

రానున్న 2-3 రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24X7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 (లేదా), పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59700కు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News August 13, 2025

NZB: విజయవాడ ఇంద్రకీలాద్రిపై TPCC అధ్యక్షుడు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారినిTPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్న రాత్రి మహేష్ కుమార్ గౌడ్ మోపిదేవిలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు.

News August 13, 2025

NZB: అవయవదానంతో మరణాన్ని జయించింది..!

image

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అంటారు పెద్దలు. కానీ అవయవదానం ద్వారా మరణించిన తరవాతా జీవించే అవకాశం లభిస్తుంది. NZB జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. NZB కోర్టులో టైపిస్టుగా పనిచేసిన అందె సుధారాణి (52) 2022 ప్రమాదవశాత్తు గాయపడి బ్రెయిన్ డెడ్ కాగా ఆమె కిడ్నీ, లివర్, లంగ్స్, కళ్లను కుటుంబ సభ్యులు జీవదాన్ ట్రస్టుకు అందజేశారు.