News February 10, 2025

ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్‌ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News September 16, 2025

జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News September 16, 2025

కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేసిన నెల్లూరు ఆర్డీవో

image

నెల్లూరు నగర ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నెల్లూరు ఆర్డీవో అనూష రేషన్ షాప్ డీలర్లకు కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. తొలుత ఆమె సాంకేతిక సిబ్బందితో కలిసి యంత్రాల వినియోగ విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు ఎంతో పారదర్శకంగా, వేగవంతంగా సేవలందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. నగర ఎమ్మార్వో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

News September 15, 2025

నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

image

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.