News August 9, 2025
ప్రజలకు కడప ఎస్పీ హెచ్చరిక

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News August 8, 2025
మర్రిపాడు వద్ద ప్రమాదం.. యువకుడి మృతి

బద్వేల్‌కు చెందిన వ్యక్తి మర్రిపాడు వద్ద మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. బద్వేల్‌లోని సుమిత్రా నగర్‌లో ఉండే మహమ్మద్, ఆకాశ్ పిల్లలను స్కూల్‌లో చేర్పించేందుకు బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లారు. తిరిగి బద్వేల్ వస్తుండగా మర్రిపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
News August 8, 2025
కడప జిల్లాలో 10 AMCల్లో.. రైతులకు ఉపయోగంలో ఉండేవి నాలుగే.!

జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే రైతులకు ఉపయోగంలో ఉన్నాయి. కడప యార్డులో సీజన్లో మాత్రమే ముడి పసుపు ట్రేడింగ్ జరుగుతుంది. మైదుకూరు యార్డులో మంగళవారం రోజు పశువుల సంత నిర్వహిస్తారు. పులివెందుల యార్డులో గురువారం పశువుల మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ సీజన్లో బత్తాయి ట్రేడింగ్ జరుగుతుంది. ముద్దనూరు యార్డులో మాత్రమే రైతులు ప్రతిరోజూ ఆకుకూరలు కూరగాయలు అమ్ముకుంటారు.
News August 7, 2025
కడప: అంతర జిల్లాల దొంగలు అరెస్టు

జిల్లాలో పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇల్లు, బంగారు దుకాణాలను వీళ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుండే వారని పోలీసులు తెలిపారు. ఈ నిందితులు మైదుకూరు డివిజన్లో ఎక్కువగా చోరీలు చేసినట్లు చెప్పారు. అర కేజీ బంగారం, 10 కేజీలు వెండి ఆభరణాలు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.