News July 9, 2025

ప్రజలకు కామారెడ్డి ఎస్సీ సూచనలు

image

కామారెడ్డి జిల్లా ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. వర్షం కురిసినప్పుడు రోడ్లు తడిగా ఉండి వాహనాలు జారే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ తీగలు, స్తంభాలతో పాటు పాత ఇండ్లకు దూరంగా ఉండాలని SP విజ్ఞప్తి చేశారు.

Similar News

News July 9, 2025

మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

image

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.

News July 9, 2025

ఖమ్మం జిల్లాలో తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

image

ఖమ్మం జిల్లాలో MPTCల సంఖ్య తేలింది. గత ఎన్నికల్లో 289 స్థానాలుండగా ప్రస్తుతం 284కు తగ్గాయి. జిల్లాలో కల్లూరు, ఎదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో సంఖ్య తగ్గింది. కల్లూరులో 5 స్థానాలు తగ్గటంతో 13 స్థానాలతో అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కల్లూరులో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అటు ఎదులాపురంలోని గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావటంతో పెద్దగా MPTCల సంఖ్య మారలేదు.

News July 9, 2025

తాటిగుంటపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

image

వీరబల్లి (M) తాటిగుంటపల్లి సర్పంచ్ గోపినాథరెడ్డి చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారిని రాధమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకుని నిధులు మింగేయడంతో గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీవో మస్తాన్ వలి విచారణ చేసి రూ. లక్షలలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. దీంతో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.