News December 24, 2024

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం ఎస్పీ  

image

జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ క్రిస్మస్ పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని కోరారు.

Similar News

News February 8, 2026

మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

image

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.

News February 8, 2026

వైఎస్ జగన్‌‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

image

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంట‌ను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.

News February 8, 2026

పాకల బీచ్ ఫెస్టివల్‌ కు రానున్న ప్రముఖ యాంకర్

image

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.