News October 20, 2025
ప్రజలకు జిల్లా కలెక్టర్ DIWALI WISHES

జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి దీపం ప్రతిఒక్కరి జీవితాల్లో విజయాల కాంతిని నింపాలి. ఈ దీపావళి పండుగలో దీపాల వెలుగు చీకటిని తొలగించి, మీ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతితో పాటు కొత్త ఆశలను నింపాలని కోరుకుంటున్నాను” అని ప్రజలనుద్దేశించి ఆయన హృదయపూర్వక విషెస్ చెప్పారు.
Similar News
News October 20, 2025
జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.
News October 20, 2025
మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
News October 20, 2025
VKB: అనంతపద్మనాభ స్వామి ఆలయం మూసివేత

వికారాబాద్‌కు సమీపంలోని మహిమాన్విత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అమావాస్యను పురస్కరించుకుని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ నరేందర్ తెలిపారు. నిత్యం భక్తులు సందర్శించి, మొక్కులు తీర్చుకునే ఈ ఆలయాన్ని అమావాస్య ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి తెరుస్తామని ఆయన వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.