News April 11, 2025
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం: MP కావ్య

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కనకదుర్గ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్‌ను ఎంపీ కడియం కావ్య కట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News September 17, 2025
రావులపాలెం: జొన్నాడ ఫ్లైఓవర్‌పై సీఎం ఆరా

రావులపాలెం-జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆరా తీశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
News September 17, 2025
చైతన్యపు ఖిల్లా.. మన ఖమ్మం జిల్లా

ఖమ్మంకు ‘చైతన్యపు ఖిల్లా’ అనే పేరు రావడానికి కారణం నాటి తెలంగాణ సాయుధ పోరాటమే. భూస్వాములు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరిగిన ఈపోరాటంలో జిల్లా ప్రజలు ఒడిసెలు, గొడ్డలి వంటి పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకుని పోరాడారు. నల్లమల గిరిప్రసాద్, దేవూరి శేషగిరిరావు, రజబ్ అలీ, మంచికంటి రామకిషన్రావు వంటి నేతలు ముందుండి నడిపారు. మీనవోలు, అల్లీనగరం, గోవిందాపురం వంటి గ్రామాలు ఉద్యమానికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి.