News June 27, 2024
ప్రజలకు పారదర్శకమైన సేవాలందించాలి: సృజన
అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలని కలెక్టర్ సృజన అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా నూతన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సృజనను ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు.
Similar News
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష కేంద్రాలలో మార్పులు
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.
News November 27, 2024
కృష్ణా: ధాన్యం విక్రయాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా 8247693551 నంబర్‌కి ఫోన్ చేసి తెలియపర్చవచ్చన్నారు.