News October 2, 2025

ప్రజలకు భరోసా కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలి: ఎస్పీ

image

ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. డీపీఓలో బుధవారం తెనాలి, సౌత్ పోలీస్ సబ్-డివిజన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. PS పరిధిలోని స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేరాల నియంత్రణ కోసం దృఢమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెనాలి DSP జనార్థన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 1, 2025

GNT: నిబంధనలు పాటించని 19 ఆర్.ఓ. ప్లాంట్లు సీజ్

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలు పాటించని 19 ఆర్.ఓ. ప్లాంట్లను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగ సాయి కుమార్ తెలిపారు. బుధవారం తెనాలి మండలం (బుర్రిపాలెం, గుడివాడ), తుళ్లూరు మండలం (అనంతవరం, తుళ్లూరు, లింగయపాలెం)లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆర్.ఓ. ప్లాంట్లను తాత్కాలికంగా సీజ్ చేసి, నోటీసులు అందిస్తున్నట్లు డీపీఓ వెల్లడించారు.

News October 1, 2025

GNT: ‘గెలుపు ఒక వాక్యం, ఓటమి ఒక పాఠశాల’

image

క్రీడాకారులకు గెలుపు ఒక వాక్యం లాంటిదని, అయితే ఓటమి అనేది ఒక పాఠశాల వంటిదని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన 62వ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చదరంగం బోర్డుపై ఆడే ఈ ఆటలో ప్రతి కదలిక ఒక ఆలోచన, ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి విజయం ఒక క్షణిక ఆనందమని ఆయన అన్నారు.

News October 1, 2025

మలేసియా బృందానికి స్వాగతం పలికిన సీఆర్డీఏ అధికారులు 

image

రాజధాని అమరావతిలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు పర్యటించేందుకు మలేసియా బృందం అమరావతికి చేరుకుంది. బృందంలోని సభ్యులైన మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వైబి తువాన్ గణపతిరావు వీరమన్, మలేసియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సతీశరావు వేంకటేశలం బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. CRDA అడిషనల్ కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ వారికి స్వాగతం పలికారు.