News July 19, 2024
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సంతోష్

బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బధావత్ సంతోష్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News August 25, 2025
చిన్నచింతకుంట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎస్.రాము(39)మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఊకచెట్టు వాగు చెక్ డ్యామ్‌లో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ వరద నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
News August 24, 2025
MBNR: ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ర్యాగింగ్‌లో పాల్గొనే విద్యార్థులను కళాశాల నుంచి తక్షణమే బహిష్కరిస్తారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తారని తెలిపారు. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
News August 24, 2025
MBNR: వినాయక చవితికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి వేడుకలను పరిష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద ప్రాంతాలలో దారికి అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.