News August 29, 2024
ప్రజలకు మెరుగైన సేవలు అందించండి: నంద్యాల జిల్లా కలెక్టర్

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సచివాలయ సిబ్బందికి సూచించారు. బుధవారం నంద్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని రైతు నగర్‌లో సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News March 13, 2025
ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.
News March 12, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు

➤ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్భ్రాంతి
➤ మహిళపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు
➤ హీరో బైక్ గెలుచుకున్న కర్నూలు యువకుడు
➤ ఆదోనిలో సంచలనంగా ఈశ్వరప్ప మృతి
➤ ఇంటర్ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థుల డిబార్
➤ పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
➤ విద్యార్థులను మోసం చేసింది చంద్రబాబే: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
➤ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆపండి
News March 12, 2025
కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డిబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,499 మంది పరీక్షకు హాజరు కాగా 401 విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. మద్దికేరలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చెప్పారు.