News December 24, 2025

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

image

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్‌ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.

Similar News

News December 31, 2025

ఖమ్మం: పంట రుణాల పరిమితిపై కలెక్టర్ కీలక సమీక్ష

image

ఖమ్మం డీసీసీబీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి పంటలపై రుణ పరిమితి నిర్ణయంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సమీక్షించారు. ఎరువులు, విత్తనాలు, యంత్రాలు, ఇతర సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకొని రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సాగు పరిస్థితులు, పాడి పరిశ్రమకు అనుగుణంగా రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 30, 2025

BIG BREAKING: ఖమ్మం: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది. ఖమ్మం ఎన్నికలు GHMCతో పాటు మే నెలలో జరగనున్నాయి.
SHARE IT

News December 30, 2025

ఖమ్మం: రూ.2.5 లక్షలతో జర్మనీలో ఉద్యోగావకాశాలు

image

‘టామ్‌కామ్’ ఆధ్వర్యంలో నర్సులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. బీఎస్సీ లేదా జీఎన్ఎమ్ పూర్తి చేసి, ఏడాది క్లినికల్ అనుభవం ఉన్న 22-38 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం నెలకు రూ.2.5 నుంచి 3 లక్షల వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.