News October 16, 2025
ప్రజలను మోసం చేసిన గ్యాంగ్ అరెస్ట్: వనపర్తి సీఐ

ఫేక్ లింకులతో ప్రజలను మోసం చేసిన గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు వనపర్తి సీఐ కృష్ణయ్య తెలిపారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రూ.20.35 లక్షల మోసపూరిత లావాదేవీల్లో పాల్గొన్న నలుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి ఒక ఇండికా కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ట్రాన్సాక్షన్‌ల ఆధారంగా కేసును ఛేదించామని తెలిపారు.
Similar News
News October 17, 2025
కేయూ రిజిస్ట్రార్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
News October 17, 2025
MNCL: చిరు వ్యాపారులకు చేయూత

చిరు, వీధి విక్రయదారులకు బ్యాంక్ రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. లోక కళ్యాణం పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా అధికారులు వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 29000 మంది వ్యాపారులకు రూ.45 కోట్లకు పైగా రుణాలను అధికారులు అందజేశారు.
News October 17, 2025
కరీంనగర్: గ్రేడ్ A రకానికి రూ.2,389/-

2025-26 వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్‌లో 9.24 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ నేపథ్యంలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,304 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. గ్రేడ్ A రకం వడ్లకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369లను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది.