News April 7, 2024
ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా, కేంద్ర సాయిధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News December 26, 2025
GNT: పెదకాకాని హైవేపై ప్రమాదం.. చిధ్రమైన శరీరం

పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకాయంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.
News December 26, 2025
ఫ్లాష్.. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ ఈయనే..!

సుమారు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడగా, అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News December 26, 2025
గుంటూరు: రూ.53 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని SP పేర్కొన్నారు.


