News February 10, 2026
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం: చంద్రబాబు

AP: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిబంధనలు సరళతరం చేయాలన్నారు. కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించకూడదని చెప్పారు.
Similar News
News February 26, 2026
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.
News February 26, 2026
BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News February 26, 2026
అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: KTR

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం’ అని తెలిపారు.


