News October 26, 2025

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అనగాని

image

మొంథా తుఫాన్‌ దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు .రెవెన్యూ, పోలీస్, NDRF బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 27, 28, 29 తేదీలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీరందాటే వరకు సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

Similar News

News October 26, 2025

పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. చర్ల సరిహద్దులో ఘటన

image

తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ గ్రామానికి చెందిన కట్టాం రవి, సోడి తిరుపతిలను పదునైన ఆయుధాలతో హత్య చేశారు. ఇన్ఫార్మర్లనే కారణమంటూ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన అధికారులతో తుఫాను సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. తుఫాను సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

News October 26, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

image

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.