News August 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నేటితో పాటు.. రానున్న కొద్దిరోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, వాగుల వద్దకు వెళ్లవదన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

Similar News

News August 26, 2025

చిత్తూరు ప్రజలకు చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

image

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.

News August 26, 2025

అమలాపురం: చేపల వేటకు వెసులుబాటు కల్పించాలని వినతి

image

ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు సముద్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా చేపల వేట చేసుకునే వేసులపాటు కల్పించాలని ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్‌కు తెలియజేశారు.

News August 26, 2025

తాళ్లరేవు: స్నేహితుల మధ్య ఘర్షణ.. వ్యక్తి హత్య

image

తాళ్లరేవు(M) కోరంగి పీఎస్ పరిధిలో మంగళవారం యానాంకిపాలెపు శ్రీను(45) హత్యకు గురయ్యాడు. శ్రీను, అతడి స్నేహితుడికి మధ్య సెల్ఫోన్ విషయంలో మురళీనగర్ వద్ద ఘర్షణ జరిగింది. శ్రీనుని అతని స్నేహితుడు తలపై రాయితో మోది చంపాడు. అనంతరం ఇసుక గుట్టలో మృతుడి తలను కప్పేసి పరారయ్యాడు. గస్తీలో ఉన్న యానాం ఎస్సై పునీత్ రాజ్ కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.