News August 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో రాబోయే కొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News August 27, 2025
నెలాఖరున రోహిత్, రాహుల్‌కు యోయో టెస్ట్?

ఈ నెల 30-31 తేదీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజుల్లో వారు యోయో టెస్ట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టును క్లియర్ చేసేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం బీసీసీఐ యో యో టెస్ట్ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను మరింత ఫిట్, స్ట్రాంగ్‌గా ఉంచేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.
News August 27, 2025
కుల్కచర్ల: అక్రమ రిజిస్ట్రేషన్‌తో మోసం.. ముగ్గురి అరెస్ట్

కుల్కచర్లలో అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ పేరుతో మోసానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులైన కలకొండ మనోజ్ కుమార్, గడుల గణేష్, మురళి నాయక్ ఒక రైతును నమ్మించి మోసపూరితంగా 1 ఎకరా 16 గుంటల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రైతుకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
News August 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.