News March 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.
Similar News
News March 29, 2025
ఆ టికెట్లను ఆన్‌లైన్‌లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

రైలు టికెట్ల రద్దుకు సంబంధించి ఇండియన్ రైల్వే కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టికెట్లనూ ఇకపై IRCTC వెబ్సైట్లో లేదా 139కి కాల్ చేయడం ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గుతుందని చెప్పారు. అయితే టికెట్ రీఫండ్ కోసం ఆయా కౌంటర్ల వద్దకే వెళ్లాలని సూచించారు.
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
News March 29, 2025
ఏటూరునాగారం: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: PO

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా కోరారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఏప్రిల్ 4న పరకాలలో ఎంపిక జరురుగుతుందన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.