News March 1, 2025
ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్

ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే తాగు నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా అతిసార ప్రబలడంతో వైద్య సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్‌లను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 1, 2025
కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.
News March 1, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.