News April 6, 2026

ప్రజలు ఆహార భద్రతలో రాజీ పడొద్దు: మహేందర్ జి

image

ప్రజలు ఆహార భద్రతలో రాజీ పడొద్దని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారమే ఆరోగ్యానికి మేలని పేర్కొన్నారు. గడువు తేదీలు పరిశీలించి వస్తువులు కొనాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో శుభ్రతతో ఆహారం తయారు చేయాలని, హోటల్స్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 14, 2026

శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

image

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు.

News April 14, 2026

పరికరాల పేరుతో ఆన్‌లైన్‌ మోసం

image

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా డెంటల్‌ పరికరాల విక్రయం పేరుతో ఓ మహిళా వైద్యురాలిని మోసం చేసిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. నగరంలోని ప్రైవేట్‌ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఆమె, ఓ యాప్‌ ద్వారా పరికరాలు ఆర్డర్‌ చేసి నగదు చెల్లించారు. ఎంతకీ వస్తువులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సోమవారం ఖానాపురం హవేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2026

గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

image

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.