News October 28, 2025

ప్రజలు ఇబ్బందులు పడకూడదు: మంత్రి అచ్చెన్న

image

కోనసీమ జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్న ఆదేశించారు. అమలాపురం ఆర్డీవో ఆఫీసులో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుఫాన్ గండం నుండి బయట పడాలని ఆకాంక్షించారు.

Similar News

News October 29, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.

News October 29, 2025

SRPT: విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు: ఎస్పీ

image

పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్పీ నర్సింహ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన కేసులు, కేసు విచారణ గురించి అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యాప్‌ ద్వారా లోన్‌ ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మొద్దని సూచించారు.

News October 29, 2025

జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

image

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.