News July 2, 2024
ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.
Similar News
News February 17, 2026
VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.
News February 17, 2026
VZM: ‘లింగ వివక్షతను అరికట్టాలి’

సమాజంలో ఉన్న లింగ వివక్షత, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి, ప్రజలకు విస్తృతమైన అవగాహన అవసరమన్నారు. ఈ మేరకు విజయనగరం DMHO కార్యాలయంలో ‘లింగ వివక్షత ఆధారిత హింస నివారణ, సామర్థ్య పెంపుదల’ అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
News February 16, 2026
విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


