News August 27, 2025
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: KMR కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వరదల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండాయని, ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణాలు మానుకోవాలని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు, పొలాలకు వెళ్లవద్దని కోరారు.
Similar News
News August 27, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఉమ్మడి KNR(D)లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు, వాగులు, వంకల దగ్గర నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని తెలిపారు. వర్షంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
News August 27, 2025
భారీ వర్షాలు.. సెలవు ఇవ్వాలని డిమాండ్!

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాలను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడగా, ఎల్లుండి యథావిధిగా జరగనున్నాయి.
News August 27, 2025
MDK: మూడు నెలల్లోనే కొత్త బ్రిడ్జి మునక

జాతీయ రహదారి విస్తరణలో హవేలీ ఘనపూర్ దాటినా తరువాత నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకర మలుపును స్ట్రైట్ గా తీర్చిదిద్దారు. నక్క వాగు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీర్ ప్లాన్ వేశారు. రోడ్డు వేసిన రెండు, మూడు నేలల్లోనే కొత్త రోడ్డు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రవాహంలో కారు కొట్టుకుపోగా ఓ యువకుడిని 4 గంటల తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.