News September 25, 2024

ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వండి: కృష్ణా కలెక్టర్

image

స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజనరీ డాక్యుమెంట్ తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై సమీక్షించారు.

Similar News

News October 11, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి ఈ నగరాల మధ్య అదనపు విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.

News October 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News October 11, 2024

ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు..ప్రజల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరింది.