News October 8, 2025

ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రాబోయే మూడు గంటల్లో ఏలూరు జిల్లాలో 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలకు, పొలాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

Similar News

News October 8, 2025

వైవీయు నూతన వీసీగా రాజశేఖర్

image

కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బెల్లంకొండ రాజశేఖర్‌ను అధికారులు నియమించారు. కొన్ని నెలలుగా ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా ఇన్‌ఛార్జే ఉండటంతో నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న బెల్లంకొండ రాజశేఖర్‌ను నియమించారు.

News October 8, 2025

దగ్గు సిరప్‌‌పై కేంద్రం కీలక ఆదేశాలు

image

దగ్గు సిరప్‌తో MP, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్‌‌, ఫైనల్ ప్రొడక్ట్స్‌ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

News October 8, 2025

నామినేషన్ల దాఖలులో ‘కోడ్’ పాటించాలి: నల్గొండ ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు అభ్యర్థులు ముందుగా పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.