News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.

News November 19, 2025

ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

image

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 19, 2025

నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

image

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.