News February 28, 2025
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్: గొట్టిపాటి

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బడ్జెట్ దోహదపడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. తాను మంత్రిగా ఉన్న ఇంధన శాఖకు రూ.13,600 కోట్ల బడ్జెట్ కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 28, 2025
శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
News February 28, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ఏలూరు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు✷జిల్లావ్యాప్తంగా ఘనంగా టైలర్ల దినోత్సవ వేడుకలు ✷ అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు ✷ కూటమి ప్రభుత్వం బడ్జెట్ పట్ల కూటమి నాయకుల హర్షం ✷ఇది మోసపూరిత బడ్జెట్: సీపీఐ నేత రామకృష్ణ ✷ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం✷ పలు శివాలయాలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
News February 28, 2025
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: కిమిడి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రూ.3,22,359 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసిందన్నారు.